హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో కలెక్టర్ దివాకర్‌తో కలిసి మంత్రి పొంగులేటి పర్యటించారు. గుర్రాలపాడు రోడ్డు నుంచి ఆబెండ్డిప్ వరకు, 25, 26 వార్డుల్లో రూ. 5.19 కోట్ల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.