MBNR: జడ్చర్ల మండలం బాదేపల్లి మార్కెట్ యార్డుకు నవంబర్ 26 (గురువారం) సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి అశ్వక్ హైమద్ తెలిపారు. ధాన్యం అధికంగా రావడం, లిఫ్టింగ్ ఆలస్యం, భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం క్రయవిక్రయాలు ఉండవని, రైతులు ధాన్యం తీసుకురావద్దని సూచించారు. వర్షం నుంచి పంటను కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
రేపు మార్కెట్ యార్డుకు సెలవు


