హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో కోతుల బెడద.. ప్రజలకు ఇక్కట్లు

VKB: పరిగి పట్టణంలోని గాంధీ విగ్రహం పరిసరాల్లో కోతుల బెడద తీవ్రంగా మారింది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడి చిన్నపిల్లలపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దుకాణాల్లోకి ప్రవేశించి వస్తువులను ఎత్తుకెళ్తుండటంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.