హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తు పదార్థాలు, దళితులపై దాడులను అరికట్టాలని ఎస్పీకి వినతి

ADB: జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, బెల్ట్ షాపుల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతలు బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ కి వినతిపత్రం అందజేశారు. అలాగే దళిత, గిరిజనులపై దాడులను అరికట్టి, అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడాల స్వామి మాదిగ, జిల్లాధ్యక్షుడు అరెల్లి మల్లేష్, అశోక్, రవి, తదితరులు ఉన్నారు.