VKB: కొట్పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై రావులపల్లి గేటు వద్ద సూచిక బోర్డు విరిగి పడిపోయింది. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, కొత్తగా వచ్చే ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు దారి తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొత్తవారికి మార్గం గుర్తించడం కష్టంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి నూతన సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రావులపల్లి గేటు వద్ద విరిగిన సూచిక బోర్డు


