హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లి పంటలను పరిశీలించిన ఏఈఓ వినోద్

ASF: రెబ్బెన మండలంలోని తక్కలపల్లి గ్రామంలో సాగు చేస్తున్న పల్లి పంటలను బుధవారం ఏఈఓ వినోద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల ఎదుగుదల, ప్రస్తుత పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటల్లో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సరైన యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు. పంటల సాగులో వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటించాలన్నారు.