హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: CM సభా ఏర్పాట్లను పరిశీలించిన MLA

NGKL: అచ్చంపేట పట్టణంలో రేపు సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.