హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెండో విడతలో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు'

GDWL: గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కానుకలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, మరో 2 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండో విడతలోనూ అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.