హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యాభివృద్ధికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం: MLA

మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్.గుట్ట హైస్కూల్‌లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.