హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వెంచర్లకు అనుమతులివ్వొద్దు'

MBNR: ఇనుప పరిశ్రమల సమీపంలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లకు అనుమతులు మంజూరు చేయవద్దని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. బాలానగర్ మండలం గుండేడ్ శివారులోని దిలీప్ రీరోలింగ్ ఐరన్ పరిశ్రమ, రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ శివారులోని బిలాస్ రాయ్ స్పాంజ్ ఐరన్ పరిశ్రమల సమీపంలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.