హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రంలో తొలిముద్ద వేడుక

VKB: పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తొలిముద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సంతోష, ప్రమీల మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన బాల్యానికి, బంగారు భవిష్యత్తుకు పునాది వేయవచ్చని తెలిపారు. పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.