KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 136 వాహనాల ద్వారా రైతులు 1,184 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, గరిష్ఠ ధర రూ.9,150, కనిష్ఠ ధర రూ.8,900, మోడల్ ధర రూ.9,100 పలికింది. ఈ వివరాలను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న వెల్లడించారు. రైతులు ప్రైవేట్ దళారులను ఆశ్రయించి మోసపోకుండాచూడాలి అన్నారు.
తెలంగాణ
జమ్మికుంట మార్కెట్లో పెరిగిన పత్తి ధరలు


