హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికులకు రైల్వే షాక్.!

MDCL: రైలు ప్రయాణికులకు ద.మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. మేడ్చల్–అక్కన్నపేట రైల్వే సెక్షన్‌లో ట్రాక్ డబ్లింగ్ పనుల కారణంగా 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరో 4 రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ మార్పులు డిసెంబర్ 14 నుంచి 22 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రయాణానికి ముందే రైళ్ల రాకపోకల వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచించారు.