హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెన్నకేశవనాథ ఆలయానికి వెండి కిరీటం బహూకరణ

JGL: రాయికల్ చెన్నకేశవనాథ (గుడికోట) ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారికి బుధవారం రూ.2 లక్షల విలువైన వెండి కిరీటాన్ని దాతలు బహూకరించారు. జగిత్యాలకు చెందిన బొడ్ల మనోహర్–లక్ష్మి, రాయికల్‌కు చెందిన నాగమల్ల శ్రీకర్–శ్వేత దంపతులు ఈ కానుక సమర్పించారు. అర్చకులు సతీశ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలను సన్మానించారు.