SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని శ్రీశైల జగద్గురు సూర్య సింహాసన పీఠాధిపతి డా. చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మహాస్వాములకు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తెలంగాణ
శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీశైల జగద్గురువులు


