హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మేడారం సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

PDPL: ధర్మారం మండలం మేడారం సామాజిక ఆరోగ్య కేంద్రంను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి విభాగాలను పరిశీలించి, రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆసుపత్రిలో పూర్తిస్థాయి సేవలు అందిస్తామని తెలిపారు. ధర్మారం మండలం వివిధ గ్రామాల ప్రజలు ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు.