హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోదాడ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు

SRPT: హైటెక్ బస్టాండ్ నిర్మాణ పనుల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ లోపలి భాగం మూసివేయడంతో ప్రవేశ ద్వారం వద్దే బస్సులు నిలుపుతున్నారు. రాత్రి  కురిసిన వర్షానికి గుంతల్లో నీరు చేరి బురదమయంగా మారడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు స్పందించి గుంతలు పూడ్చి తాత్కాలిక సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.