హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదవ సంఘం అధ్యక్షుడికి వినోద్ కుమార్ సన్మానం

SRCL: ఇల్లంతకుంట మండల యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఓరుపుల రాములు యాదవ్‌ను బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఘనంగా సన్మానించి అభినందించారు. శాలువాతో సత్కరించి,యాదవ సంఘం బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు.