హైదరాబాద్: 28°C
తెలంగాణ

తరగతి గదుల్లోనే దేశ నిర్మాణం: ఎంపీ

MDK: తరగతి గదుల్లోనే దేశ నిర్మాణం జరుగుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో శిశు మందిర్ పాఠశాల నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు సమాజం, క్రీడలపై అవగాహన కల్పించాలని, వారి అభిరుచులకు తగిన రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.