హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోల్డ్‌లోన్ కస్టమర్లకు బ్యాంకుల షాక్..డబ్బులు కట్టాలని ఒత్తిడి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంగారం ధరలు తగ్గుతుండటంతో 2025-26లో గోల్డ్ లోన్ తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి ఫోన్లు, మెసేజ్‌ల తాకిడి పెరిగింది. నిబంధనల ప్రకారం కొంత నగదు చెల్లించాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నట్లు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ధర మరింత పెరిగితే రికవరీ కష్టమవుతుందని, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫాలోఅప్ చేస్తున్నామని బ్యాంకు సిబ్బంది తెలిపారు.