హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ పార్టీ నుంచి పలువురు సస్పెండ్

PLD: నరసరావుపేట పురపాలక ఎన్నికల నేపధ్యంలో TDP నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు నేతలను పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ ఆదేశాల మేరకు 12వ వార్డుకు చెందిన మదీనా రసూల్, షేక్ మస్తాన్వలి, 7వ వార్డుకు చెందిన గాడిపర్తి రమేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు జానీ సైదా తెలిపారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.