కోనసీమ: మండపేట బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండపేట నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న ఆటో లారీని ఓవర్టేక్ చేయబోయింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను చూసి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో రోడ్డుపై బోల్తా పడింది. నియంత్రణ కోల్పోయిన బైక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, బైకర్‌కు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు


