హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 1న స్కిల్ ఫ్యాక్టరీ ప్రారంభం

ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు టాస్క్ (TASK) సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా కల్వకుర్తి పట్టణంలో డిసెంబర్ 1న స్కిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పారు. రాబోయే మూడు నెలల్లోనే 100 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.