హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మన్‌గా రాజరాజేశ్వరి బాధ్యతలు

పల్నాడు: చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మన్‌గా తోట రాజరాజేశ్వరి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, చిలకలూరిపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.