MNCL: తాండూర్ మండలం మాదారంలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన నీటి కుంటలను MPDO శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్ వినియోగం తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
మాదారంలో ఉపాధి హామీ నీటి కుంటల పరిశీలన


