SRPT: కోతలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా చివ్వేంల మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు కల్లాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచుతున్నారు. వర్షాలతో ధాన్యం తడిసే భయం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలు లేక వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతన్నలు కోరుతున్నారు.
తెలంగాణ
నెల రోజులైనా తెరుచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు


