MBNR: మహబూబ్నగర్–నవాబుపేట మార్గంలో ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి మూడు బస్సులు రావడం, ఆ తర్వాత గంటల తరబడి రాకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికుల అవస్థలు


