హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికెన్ ప్రియులకు ఊరట.. తగ్గిన ధరలు

NLG: కార్తీక మాసం ప్రభావంతో నల్గొండ జిల్లాలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గతంలో కిలో డ్రెస్డ్ స్కిన్ చికెన్ రూ.240 ఉండగా, ప్రస్తుతం రూ.208కు విక్రయిస్తున్నారు. స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.235గా ఉంది. మరోవైపు గుడ్డు ధర మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం డజను గుడ్ల రిటైల్ ధర రూ.80గా కొనసాగుతోంది. చికెన్ ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.