హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్ని ప్రమాదంలో వరి గడ్డి దగ్ధం

ప్రకాశం: గిద్దలూరు మండలం ఉయ్యాలవాడలో మంటలు అంటుకొని వరిగడ్డి దగ్ధం అయిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముల్లా ఖాదర్ వలి తన గేదెల కోసం ఇటీవల 200 కట్టల వరి గడ్డిని కొనుగోలు చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కానీ అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన గ్రామస్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.