హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెలవుల్లో పంచాయతీ కార్యదర్శి.. ఇబ్బందుల్లో ప్రజలు

ASF: బెజ్జూర్ మండల కేంద్ర గ్రామపంచాయతీ కార్యదర్శి వైకుంఠం సెలవులో ఉండి 18 రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో పంచాయతీ పనులు నిలిచి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు,అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సర్పంచ్ సరోజ తెలిపారు. వెంటనే మరో కార్యదర్శిని ఇంచార్జ్ గా నియమించాలని సర్పంచ్, గ్రామస్థులు కోరుతున్నారు.