హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSUI బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

KMM: వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్‌ను NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తూ NSUI బలోపేతానికి కృషి చేస్తానని సురేష్ నాయక్ తెలిపారు.