హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు అయ్యేంతవరకు మందు బంద్

PLD: పంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో ఈపూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేశారు. ఈపూరు, బొల్లాపల్లి, రొంపిచర్ల మండలాల్లో మొత్తం తొమ్మిది మద్యం దుకాణాలుండగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు అన్నింటినీ మూసివేసినట్లు సీఐ డీ. వెంకటేశ్వర్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచుతామని తెలిపారు.