హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదం అంచున ప్రయాణం

బాపట్ల-గుంటూరు రూట్‌లో ఆర్టీసీ బస్సులో సీట్లు లేక ఓ ప్రయాణికుడు డోర్ బయట వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించాడు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలకే ముప్పు. బస్సు వేగంగా వెళ్తుంటే పట్టు తప్పితే ఘోరం జరిగేదే. రద్దీ సమయంలో అదనపు బస్సులు పెంచి, డోర్లు మూసి నడపాలని, ప్రయాణికుల భద్రతపై ఆర్టీసీ అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.