E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని YCP మేయర్ అభ్యర్థి దాసి వెంకటరావు CPM నేతలను కోరారు. CPM జిల్లా కార్యాలయానికి వెళ్లిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై CPM నాయకులు టి.అరుణ్, వి.ఉమామహేశ్వరరావు సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ ఎన్నికల్లో CPM మద్దతు కోరిన YCP


