హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల ప్రాణాలకు ముప్పుగా గ్రానైట్‌ లారీలు

KNR: కరీంనగర్‌లో గ్రానైట్‌ లారీలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్త, పరిమితికి మించిన లోడుతో రోడ్లపై దూసుకెళ్తున్న లారీలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. బండరాళ్లు కిందపడటం, మంటలు చెలరేగడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ ప్రయాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.