హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ బరిలో మాజీ మావోయిస్టు

ASR: హుకుంపేట మండలం ములియాపుట్టు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ మావోయిస్టు చడ్డా భూషణం అలియాస్ నాగరాజు పోటీలో నిలిచారు. 1996 ప్రాంతంలో తాండవ దళం కమాండర్‌గా పనిచేసిన చడ్డా భూషణం, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది, జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయడానికి సర్పంచ్ బరిలో దిగారు.