MLG: మల్లంపల్లి మండలంలోని ఆయుర్వేద ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు విద్యుత్ సరఫరా లేక సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందుల సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో వైద్య సేవలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. అధికారులు స్పందించి నూతన భవనం మంజూరు చేసి, పూర్తి సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిల భవనంలో ఆయుర్వేద వైద్యం


