హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిసారి జెడ్పీ కార్యాలయానికి విచ్చేసిన ఛైర్మన్ గంజె

ATP: జిల్లా పరిషత్ ఛైర్మన్ గంజె నాగరాజు ప్రమాణ స్వీకారం అనంతరం బుధవారం తొలిసారి జెడ్పీ కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకు డిప్యూటీ సీఈఓ సమత పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఛాంబర్ ఏర్పాటుపై అధికారులతో చర్చించిన ఛైర్మన్, క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించి పలు మార్పులు, చేర్పులపై సూచనలు చేశారు.