హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇది ప్రయాణమా.. ప్రాణాలతో చెలగాటమా..?

PDPL: పాలకుర్తి మండలం బసంతనగర్ స్టేజీ దగ్గరున్న ఓ పెట్రోల్ బంకు వద్ద ఒకే బైక్ పైన ఐదుగురు చిన్న పిల్లలతో ఓ వ్యక్తి వెళ్లారని స్థానికులు పేర్కొన్నారు. పెట్రోల్ కోసం బంకు వద్ద ఆగిన సదరు వ్యక్తి పట్ల బంకు సిబ్బంది ఇంత మంది పిల్లలతో హెల్మెట్ లేకుండా వెళ్లొద్దని చెప్పినా వినకుండా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.