హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దేవతల్లా ఆదుకున్న మహిళా పోలీసులు

SRCL: ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా రాజమణి అనే భక్తురాలు ఫిట్స్‌తో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే స్పందించిన మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజా ప్రథమ చికిత్స అందించి ఆమె ప్రాణాలను కాపాడారు. విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు మానవతా దృక్పథాన్ని చాటుకున్న మహిళా కానిస్టేబుళ్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.