BDK: ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గిరిజన క్రీడల ఎంపికలను ఈ నెల 27, 28 తేదీల్లో కిన్నెరసానిలో నిర్వహించనున్నట్లు పీవో బి. రాహుల్ తెలిపారు. నవంబర్ 27న అండర్-17, 28న అండర్-14 బాలబాలికల విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఎలిజిబిలిటీ ఫారం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 27, 28 తేదీల్లో గిరిజన క్రీడల ఎంపికలు


