హైదరాబాద్: 28°C
తెలంగాణ

సగానికి చేరిన పోచారం ప్రాజెక్టు నీటిమట్టం

KMR: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటుతోంది. ప్రస్తుతం సగం నీటి నిల్వ మాత్రమే ఉందని ఏఈఈ అక్షయ్ వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, బుధవారం ఉదయం 6 గంటల వరకు 0.910 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. రోజుకు 28 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోతున్నట్లు వివరించారు.