హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరం సత్యదేవునికి రూ.90 లక్షల ఆదాయం

KKD: అన్నవరం రత్నగిరిపై కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా మంగళవారం భక్తజనం పోటెత్తారు. లక్ష మందికి పైగా భక్తులు సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అర్ధరాత్రి ఒంటి గంట నుంచే వ్రతాలు, తెల్లవారుజామున 2 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు. కార్తీక పౌర్ణమి రోజున ఒక్కరోజులోనే దేవస్థానానికి రూ.90 లక్షల ఆదాయం సమకూరింది.