హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

భద్రాద్రి: చండ్రుగొండ మండలం బాల్యతండాకు చెందిన ధరావత్ సక్రు కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 23న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI విజయకుమారి తెలిపారు.