హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంక్రాంతికి 30 ప్రత్యేక రైళ్లు

VSP: సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ - పార్వతీపురం మధ్య డిసెంబర్ 23 నుంచి జనవరి 27 వరకు, చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య జనవరి 7, 9, 16 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు చర్లపల్లి - నరసాపురం, హైదరాబాద్ - నరసాపురం మార్గాల్లోనూ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.