హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని 19 ఏళ్ల యువతి మృతి

ఏలూరు: తేలప్రోలు-గన్నవరం రైల్వే ట్రాక్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని కరణం భార్గవి గాయత్రి (19) మృతి చెందింది. సీతారాంపురం గ్రామానికి చెందిన ఆమె ట్రాక్ పక్కన గేదెను గమనిస్తుండగా ప్రమాదం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. లోకో పైలట్ సమాచారంతో స్టేషన్ మాస్టర్ పోలీసులకు తెలిపారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.