హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

VZM: శృంగవరపుకోట (M) కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశానికి ఈనెల 28న నిర్వహించనున్న పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇన్‌ఛార్జ్ , ప్రిన్సిపల్ కేశవప్రసాద్ తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 43 కేంద్రాల్లో పరీక్ష జరగనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉదయం 10.30 గంటలకే చేరుకోవాలని సూచించారు.