MBNR: జడ్చర్ల కావేరమ్మపేటలోని నల్లచెరువు ట్యాంక్ బండ్ చెత్తాచెదారం, ప్లాస్టిక్, మద్యం సీసాలతో అపరిశుభ్రంగా మారింది. పూజా వ్యర్థాలతో నీరు కలుషితమై దుర్వాసన వస్తోంది. దీంతో మత్స్యకారుల ఉపాధికి నష్టం కలగడంతో పాటు దోమల బెడద పెరుగుతోంది. అధికారులు వెంటనే చెత్తను తొలగించి, ట్యాంక్ బండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నల్లచెరువులో అపరిశుభ్రత.. దుర్వాసనతో ఇబ్బందులు


