హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చివరి దశకు గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌ పనులు

ATP: గుంటూరు-గుంతకల్లు మధ్య రెండవ రైల్వే లైను నిర్మాణం తుది దశకు చేరుకుంది. 401 కి.మీ ఈ మార్గంలో డబ్లింగ్ (రెండు లైన్ల నిర్మాణం) విద్యుద్దీకరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,631 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపింది. ఈ వ్యయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరించేలా ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు 376 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.