హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంట చేస్తుండగా గ్యాస్ లీక్.. అగ్నిప్రమాదం

KKD: పిఠాపురం పట్టణంలోని మంగాయమ్మరావుపేటలో గ్యాస్ లీకై మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మంగాయమ్మరావుపేటలోని నాగం వీరబాబు నివాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆయన భార్య మంగతాయారు గ్యాస్ స్టౌపై వంటలు చేస్తున్నారు. సిలిండరు నుంచి స్టవ్‌కి గ్యాస్ వచ్చే పైప్ ఊడిపోవడంతో మంటలు చెలరేగాయి. మంగతాయారుకు స్వల్ప గాయాలు కాగా, ఇంట్లో సామాన్లు, గృహోపకరణాలు కాలిపోయాయి